Header Banner

భద్రతా కారణాలతో నిలిచిన పంజాబ్-ఢిల్లీ మ్యాచ్! మళ్లీ మొదటి నుంచి!

  Tue May 13, 2025 21:14        Sports

భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా ఈ నెల 8న ధర్మశాలలో అర్ధాంతరంగా నిలిచిపోయిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్‌ను మళ్లీ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మ్యాచ్ మే 24న జైపూర్‌ వేదికగా జరగనుంది. గతంలో ధర్మశాలలో జరిగిన కొద్ది ఓవర్ల ఆటను పరిగణనలోకి తీసుకోకుండా, మ్యాచ్‌ను పూర్తిగా మొదటి నుంచి ఆడనున్నారు. ఇటీవల ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో 10.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను అధికారులు నిలిపివేశారు. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అయితే, ఈ మ్యాచ్ విషయంలో పాయింట్లు కేటాయించకపోవడంతో అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. తాజాగా ప్రకటించిన షెడ్యూల్‌తో దీనిపై స్పష్టత వచ్చింది. ధర్మశాలలో మ్యాచ్ ఆగిన సమయానికి పంజాబ్ జట్టు ఒక వికెట్ నష్టానికి 122 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పుడు మ్యాచ్‌ను మళ్లీ మొదటి బంతి నుంచి ప్రారంభించనుండటంతో, ఆ జట్టు సాధించిన ఆధిక్యం ప్రయోజనం లేకుండా పోయింది.

 

ఇది కూడా చదవండి: ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఉద్యోగ అవకాశాలు! లక్షల్లో జీతాలు.. ఇలా అప్లై చేసుకోండి!

 

ఇది పంజాబ్ జట్టుకు కొంత ప్రతికూలాంశంగా మారే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 15 పాయింట్లతో ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఒకదానిలో విజయం సాధించాల్సి ఉంది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గతంలో వాయిదా పడిన ఐపీఎల్‌ను మే 17 నుంచి పునఃప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. లీగ్ దశ మ్యాచ్‌లు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, ముంబయి వంటి ఆరు వేదికల్లో జరగనున్నాయి. టోర్నమెంట్ ఫైనల్ జూన్ 3న నిర్వహించనున్నారు. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. ఏప్రిల్ 29న క్వాలిఫయర్-1, ఏప్రిల్ 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌ల వేదికలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్లే ఆఫ్ మ్యాచ్‌లలో ఒకటి ముంబయిలో, ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!

 

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia